NEWSANDHRA PRADESH

అయ్య‌న్న పాత్రుడు అరుదైన నేత

Share it with your family & friends

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 16వ శాస‌న స‌భ‌కు నూత‌న స్పీక‌ర్ గా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఎన్నిక‌య్యారు. ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు ప్రొటెం స్పీక‌ర్ గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి.

ఈ సంద‌ర్బంగా స్పీక‌ర్ గా ఎన్నికైన అయ్య‌న్న పాత్రుడిని చంద్రబాబు నాయుడు అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. అయ్య‌న్న‌కు అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌న్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు మంత్రిగా , ఎంపీగా ఎన‌లేని సేవ‌లు అందించార‌ని కొనియాడారు ఏపీ సీఎం.

అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంద‌న్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న. అని ప్ర‌శంసించారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.

కౌరవ సభలో శపధం చేసి బయటకు వచ్చాన‌ని, ఇవాళ ప్రజల ఆమోదంతో గౌరవ సభలోకి అడుగు పెట్టాన‌ని అన్నారు. ఈ సభ గౌరవమే కాదు, రాష్ట్రంలో ప్రతి ఆడ బిడ్డ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మన సభ పైన ఉందన్నారు.