సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
గ్రామ, వార్డు సచివాలయాలపై
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా వేగం పెంచారు. సోమవారం సచివాలయంలో కీలక శాఖలపై ఆరా తీశారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేపట్టారు.
ఈ సమీక్షకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్దిలో గ్రామ, వార్డులు, సచివాలయాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే సమయంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాల్సి ఉందని, ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను గత ప్రభుత్వం పట్టించు కోలేదని, గాడి తప్పిన వాటిని గాడిలో పెట్టేందుకు తాను నానా తంటాలు పడుతున్నానని పేర్కొన్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది వహించ కూడదని, ప్రతి పథకం, కార్యక్రమం ఇంటింటికీ చేరేలా చూడాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.