వరద ప్రభావిత ప్రాంతాలకు సోలార్ లాంతర్లు
4 వేల సోలర్ లాంతర్లు ఇవ్వాలని సీఎం ఆదేశం
అమరావతి – ఏపీలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రహారాలు మాని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నతాధికారులు, మంత్రులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాలకు ఇంధన శాఖ నుంచి వెయ్యి సోలార్ లాంతర్లు సరఫరా చేశారు. సచివాలయం సిబ్బంది ద్వారా విద్యుత్ లేని ప్రాంతాలలో పంపిణీ చేసినట్లు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరో 4 వేల సోలార్ లాంతర్ లు పంపిణీ చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా భారీ ఎత్తన నష్టం వాటిల్లిందని అన్నారు. ఇదే సమయంలో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడామని తెలిపారు. అంతే కాకుండా ముంపు ప్రాంతాలకు గురైన వారిని, బాధితలు 15 వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించామని చెప్పారు చంద్రబాబు నాయుడు.