సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – దావోస్ పర్యటన విజయవంతమైందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తాను 1995 నుంచి దావోస్ కు వెళ్లడం ప్రారంభించానని చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక నుంచి ఎస్ఎం కృష్ణ వచ్చారని తెలిపారు. బిల్ గేట్స్ కూడా ఏపీ కోసం ప్రమోట్ చేస్తున్నారా అని అడిగారని గుర్తు చేశారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ కాకుండా చేస్తున్నానని అన్నారు. దావోస్ లో 27 సమావేశాలలో పాల్గొన్నానని వెల్లడించారు. కంట్రీ స్ట్రాటజిక్ డయలాగ్ అనే అంశం పై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులం పాల్గొన్నామని చెప్పారు.
హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్ లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ , గ్రీన్ ఎనర్జీ – గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫాక్చరింగ్ అనే అంశం పై సదస్సు జరిగిందన్నారు. పెట్రో కెమికల్ హబ్, బ్లూ ఓషన్ ఎకానమీ అనే అంశాల గురించి విస్తృతంగా చర్చ చేశామన్నారు. సుస్తిరాభివృద్ద్ది లక్ష్యాల సాధన, ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.
లోకేష్ 35 సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు అయ్యారని తెలిపారు. మొత్తం మీద ఏపీని తిరిగి ప్రపంచ పటం మీద పెట్టడమే తమ లక్ష్యంగా పని చేశామన్నారు చంద్రబాబు నాయుడు.
1995 లో ఐటీ రంగం, ఇప్పుడు 2025 లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలుగా మారాయన్నారు.
గతంలో నైపుణ్యం కోసం ఐటీ తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పించామన్నారు. మన వాళ్ళు ఉద్యోగాలు పొందటం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీఎం.
ఇప్పుడు మన వాళ్ళు 25 శాతం మేర యూరప్ లో ఉన్నారని,, అమెరికాలో తెలుగు 12 వ భాషగా ఉందని , ఈ మార్పు కేవలం 25 ఏళ్ల లో సాధ్యం అయ్యిందన్నారు. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పారు సీఎం. అప్పుడు చేసిన విజన్ కారణం గానే ఇది సాధ్యమైందన్నారు.
భారత పరిశ్రమల సమాఖ్య తో కలిసి గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమల సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. 2047 నాటికి అత్యంత ప్రభావిత మైన వ్యక్తులు గా తెలుగు వారు ఉంటారని జోష్యం చెప్పారు.