ఈ విజయం శ్రీనివాసుడికి అంకితం
సీఎం నారా చంద్రబాబు నాయుడు
తిరుమల – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందిన తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
సీఎం రాక సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికారు టీటీడీ అదనపు కార్య నిర్వహణ అధికారి వీర బ్రహ్మం. ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కరేకన్ వలేవాన్.
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కొనియాడారు. ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. తాను కష్ట కాలంలో ఉన్న ప్రతి సమయంలోనూ శ్రీ వేంకటేశ్వర స్వామి రక్షిస్తూ వచ్చాడని చెప్పారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని అన్నారు..ఆర్థిక అసమానతలు తొలగి పోవాలి.. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో అది పేద వారికి అందాలన్నారు. ఏపి రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలి.. పేదిరకం లేని సమాజం కోసం నిత్యం పని చేస్తాననని స్పష్టం చేశారు సీఎం