NEWSANDHRA PRADESH

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో మంత్రులు

Share it with your family & friends

తేదీలు ఖ‌రారు చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు దూకుడు పెంచారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల‌కు చెందిన మంత్రులు అందుబాటులో ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు నేటి నుంచి ఈనెలాఖ‌రు 31వ తేదీ వ‌ర‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు.

పార్టీ చీఫ్ , సీఎం ఆదేశాల మేర‌కు కేంద్ర కార్యాల‌యంలో వివిధ స‌మ‌స్య‌ల కోసం వ‌చ్చే వారికి భ‌రోసా ఇవ్వాల‌ని, వెంట‌నే అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

పార్టీకి చెందిన నాయ‌కులు , కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ప్ర‌జ‌లు అందుబాటులో ఉంటార‌ని పేర్కొంది టీడీపీ. తేదీల వారిగా 17న బుధ‌వారం ఏపీ మంత్రి తావేటి స‌విత‌, 18న ఎన్ఎండీ ఫ‌రూఖ్ , 19న ప‌ల్లా శ్రీ‌నివాస రావు రాష్ట్ర పార్టీ చీఫ్ , 22న గుమ్మ‌డి సంధ్యా రాణి, 23న కొల్లు ర‌వీంద్ర‌, 24న అన‌గాని స‌త్య ప్ర‌సాద్, 25న వాసం శెట్టి సుభాష్ , 26న ప‌ల్లా శ్రీ‌నివాస రావు , 29న కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ , 30న మండ‌ప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి, 31న బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి హాజ‌ర‌వుతారు.