చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే
బుడమేరు కట్ట తెగిన ప్రాంతం పరిశీలన
విజయవాడ – వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. వర్షాల దెబ్బకు బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని శుక్రవారం సందర్శించారు.
ఇదిలా ఉండగా బుడమేరు ఏ ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలించారు.
బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా చూశారు నారా చంద్రబాబు నాయుడు. బుడమేరుకు పడిన గండ్లు, గండ్లు పూడ్చే పనులను గుర్తించారు.
కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించారు సీఎం. దీంతో పాటు ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను చూశారు
.
కృష్ణా నది సముంద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతాన్ని, కృష్ణా నది లంక గ్రామాలను పరిశీలించారు నారా చంద్రబాబు నాయుడు. అంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న వరదల గురించి ఆరా తీశారు. దెబ్బతిన్న ప్రాంతాల గురించి ఆరా తీశారు.
ప్రభుత్వ పరంగా భాధితులకు అండగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.