Thursday, April 24, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీని ఏఐ హ‌బ్ గా మార్చేస్తాం - సీఎం

ఏపీని ఏఐ హ‌బ్ గా మార్చేస్తాం – సీఎం

స్ప‌ష్టం చేసిన చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : ఏపీని ఏఐ హ‌బ్ గా మార్చేస్తామ‌న్నారు సీఎం చంద్ర‌బాబు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్‌షాప్ చేప‌ట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన మార్గనిర్దేశం చేశారు. వర్క్‌షాప్‌కు హాజరైన సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ హాజ‌ర‌య్యారు. వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్‌తో సహా పలువురు నిపుణులు హాజ‌ర‌య్యారు.

గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలించాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఏయే విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఏఐ, ఎంఎల్, డీఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ నిర్వ‌హించారు.

వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని వివరించనున్నారు పలువురు నిపుణులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్క్‌షాప్‌లో మొదటిరోజు కార్యదర్శులు.. రెండోరోజు హాజరుకానున్న విభాగాధిపతులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments