ఇది ప్రజాస్వామ్య విజయం
జార్ఖండ్ సీఎం చెంపై సోరేన్
జార్ఖండ్ – కుట్రలు, కుతంత్రాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. ఇది అత్యంత దారుణం. ఇలాంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఉద్యమాలకు, పోరాటాలకు ఊపిరి పోసింది ఈ నేల. కానీ కొన్ని శక్తులు ప్రజలు తాము కోరుకున్న ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహాలకు చరమ గీతం పాడారు. అయినా కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు చివరి దాకా ప్రయత్నం చేశాయి. ఇంకా చేస్తూనే ఉంటాయి.
కానీ ఈ దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా ఉందని గుర్తు పెట్టుకోవాలి. ఏది ఏమైనా సరే ఎలాగైనా సరే కానీ అధికారంలోకి రావాలని , తామే ఉండాలని కోరుకోవడాన్ని ప్రజలు క్షమించరు. ఎన్నటికీ సహించరు. రాచరికం రాజ మార్గం అనుకుంటే పొరపాటు పడినట్టే. ఏదో ఒక రోజు రాజులమని తరించిన వాళ్లు, తామే గొప్ప వాళ్లమని ఊహించుకున్న వాళ్లు కాల గర్భంలో కలిసి పోయారని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు జార్ఖండ్ సీఎం చెంపై సోరేన్.
సోమవారం రాష్ట్ర శాసన సభలో ప్రస్తుత జేఎంఎం సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానం వీగి పోయింది. చెంపై సారథ్యంలో ప్రభుత్వం స్థిరంగా ఉందని తేలి పోయింది. ఈ సందర్బంగా తమకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు చెంపై సోరేన్.