మరాఠా పీఠం షిండేనే మళ్లీ సీఎం ..?
కూటమికి పవర్ తీసుకు రావడంలో కీలకం
మహారాష్ట్ర – మరాఠాలో ఎన్నికలు ముగిసినా ఎవరు సీఎం అవుతారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 288 సీట్లలో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఈసారి తమకు అత్యధిక స్థానాలు రావడంతో ఫడ్నవీస్ ను సీఎం చేయాలని ఓ వర్గం పట్టుబడుతోంది. మరో వైపు పవార్ కు పవర్ లేకుండా చేసి ఈసారి ఎన్నికల్లో షాక్ ఇవ్వడమే కాదు ఏకంగా ట్రబుల్ షూటర్ ను ఓడి పోయేలా చేసిన అజిత్ పవార్ కూడా సీఎం పదవి ఆశిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వానికి చెక్ పెడుతూ ఎవరూ ఊహించని రీతిలో అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను పెంపొందించేలా కృషి చేసిన శివసేన పార్టీ చీఫ్ , సీఎం ఏక్ నాథ్ షిండే తిరిగి మరోసారి ముఖ్యమంత్రి కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మహా వికాస్ అఘాడీకి దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వడంలో షిండే సక్సెస్ అయ్యారని, ఆయనకు ఇస్తేనే బాగుంటుందని బీజేపీ హై కమాండ్ భావిస్తున్నట్లు టాక్. ఇది పక్కన పెడితే ఒకప్పుడు ఆటో డ్రైవర్ గా పని చేసిన షిండేకు మరాఠా ప్రభుత్వ స్టీరింగ్ ను ఎలా నడపాలో బాగా తెలుసు. అందుకే షిండేనే తదుపరి ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చెప్పలేం రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు.