సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా
గవర్నర్ రాధాకృష్ణన్ కు లేఖ
మహారాష్ట్ర – మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ , అజిత్ పవార్ తో కలిసి రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గవర్నర్ కేఎస్ రాధాకృష్ణన్ తో భేటీ అయ్యారు.
అనంతరం తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. కాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు ఏక్ నాథ్ షిండే ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ ప్రకటించింది.
తమ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని ఇప్పటికే ప్రకటించారు ఏక్ నాథ్ షిండే. ఆయన ఒకప్పుడు ఆటో డ్రైవర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఈసారి జరిగిన శాసన సభ ఎన్నికల్లో అద్బుత విజయాన్ని సాధించింది మహాయుతి కూటమి. ఏకంగా భారతీయ జనతా పార్టీకి 132 సీట్లు వచ్చాయి.
శివసేన షిండే వర్గం కూడా భారీగా గెలుపొందింది. సీట్లు సంపాదించింది. అజిత్ పవార్ కూడా ప్రస్తుతం సీఎం రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఎవరు తదుపరి సీఎంగా కొలువు తీరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు ఏక్ నాథ్ షిండే.