సోరేన్ ఆహ్వానం మోడీ సంతోషం
ప్రమాణ స్వీకారానికి రావాలని విన్నపం
ఢిల్లీ – జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి కొలువు తీరనున్నారు ప్రస్తుత సీఎం హేమంత్ సోరేన్. ఆయన జేఎంఎం చీఫ్ కూడా. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీని సాధించింది. మరోసారి పవర్ లోకి వచ్చింది. 88 సీట్లలో కూటమికి 51 సీట్లకు పైగానే కైవసం చేసుకుంది. పవర్ లోకి రావాలని అనుకున్న బీజేపీ కూటమికి ఇక్కడ షాక్ తగిలింది.
ఇదిలా ఉండగా ఈనెల 28వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సంరద్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీని కలిశారు సీఎం హేమంత్ సోరేన్. ఆయన తో పాటు తన భార్య కల్పనా సోరేన్ కూడా ఉన్నారు.
ఈ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని స్వయంగా పీఎంను కలిసి ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు సీఎం హేమంత్ సోరేన్. ఇందుకు సంబంధించి స్వయంగా సోరేన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో మంగలవారం పోస్టు చేశారు. ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ కంటే కల్పానా సోరేన్ వైరల్ గా మారారు. ఎందుకంటే తను జైలులో ఉన్న సమయంలో ఆమె ఒక్కరే ఒంటరి పోరాటం చేశారు. వేలాది మందిని సంఘటితం చేశారు. జేఎంఎం పవర్ లోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు.