అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ – సోరేన్
అందుకే సోనియా గాంధీని కలిశా
న్యూఢిల్లీ – జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తన భార్యతో కలిసి సీపీపీ చైర్ పర్సన్ , మాజీ ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీని కలుసుకున్నారు. అనంతరం హేమంత్ సోరేన్ మీడియాతో మాట్లాడారు.
తాను జైలుకు వెళ్లడం, ఆ తర్వాత బెయిల్ పై బయటకు రావడానికి వెనుక కాంగ్రెస్ పాటు ఇతర పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని చెప్పారు. ఇందులో భాగంగా తాను సోనియా గాంధీని కలవలేక పోయానని తెలిపారు.
అందుకే తాను ఆమెను కలిసేందుకు ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. ఈ చర్చలలో ప్రధానంగా త్వరలో రాష్ట్రంలో జరిగే శాసన సభ ఎన్నికలపై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
గతంలో అధికారం ఉంది కదా అని మోడీ , షా ఆడిందే ఆట పాడిందే పాటగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కానీ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన రీతిలో తీర్పు చెప్పారని కొనియాడారు. అంతే కాదు దేశంలోని 7 రాష్ట్రాలలో జరిగిన శాసన సభ ఉప ఎన్నికల్లో ఏకంగా తమ కూటమికి 10 సీట్లు వచ్చాయని, బీజేపీ పనై పోయిందని అన్నారు హేమంత్ సోరేన్.