ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం – సీఎం
స్పష్టం చేసిన హేమంత్ సోరేన్
జార్ఖండ్ – జార్ఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రెండోసారి కొలువు తీరారు జార్ఖండ్ ముక్తీ మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరేన్. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్బంగా గవర్నర్ హేమంత్ సోరేన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పేరు పొందిన నేతలు హాజరయ్యారు.
ఎన్నికల సందర్బంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం హేమంత్ సోరేన్.
మరోసారి నాపై నమ్మకం ఉంచినందుకు, గెలిపించినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన కార్యాలయంలో తొలి సంతకం చేశారు.
అబువా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ఉంటుందని చెప్పారు. మైయాన్ సమ్మాన్ యోజన పథకం కింద రూ. 2,500కి పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ కింద భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు సీఎం. రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు .
అంతే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక వనరులపై పని చేస్తుందని స్పష్టం చేశారు హేమంత్ సోరేన్.