ఈ విజయం జార్ఖండ్ ప్రజలకు అంకితం
ఎన్నికల అనంతరం సీఎం హేమంత్ సోరేన్
జార్ఖండ్ – జార్ఖండ్ లో మరోసారి విజయాన్ని కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, సీఎం హేమంత్ సోరేన్. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇది తమ విజయం కానే కాదన్నారు. ఇది ముమ్మాటికీ ఈ మట్టిని నమ్ముకుని తమకు తరతరాల నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న ప్రజలదని స్పష్టం చేశారు. తమ కూటమిపై నమ్మకం ఉంచి విజయాన్ని కట్ట బెట్టినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని చెప్పారు హేమంత్ సోరేన్.
ఇది ప్రజల గెలుపు. మేం నిమిత్త మాత్రులమేనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా పాచికలు పారలేదని, కుట్రలు చెల్లలేదని …ప్రజలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని గ్రహించారని అన్నారు.
అందుకే తమకు మరోసారి ఛాన్స్ ఇచ్చారని, మీరంతా మాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు సీఎం హేమంత్ సోరేన్. ఓటు వేసిన వారికి , ఓటు వేయని వారికి సైతం పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.