కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లే
సీఎం హిమంత బిశ్వా శర్మ
న్యూఢిల్లీ – సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి నేరుగా బీజేపీలోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత సీఎం పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు.
తాజాగా ఓ జాతీయ మీడియాతో జరిగిన చిట్ చాట్ లో హిమంత బిశ్వా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతోందని జోష్యం చెప్పారు. మొత్తం 545 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ గణనీయమైన సీట్లను కైవసం చేసుకుంటుందన్నారు. మొత్తంగా తన అంచనా ప్రకారం తమ సంఖ్య 400కు పైగా దాటుతుందని జోష్యం చెప్పారు సీఎం.
అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సరికి ఆ పార్టీకి కనీసం 11 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కలిసి ఏర్పాటైన ఇండియా కూటమికి మొత్తంగా 30 సీట్లకు మించి రావని పేర్కొన్నారు. దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారని ఇది తమతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారని అన్నారు హిమంత బిశ్వా శర్మ.