NEWSANDHRA PRADESH

ఎడెక్స్ తో ఒప్పందం చ‌రిత్రాత్మ‌కం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో రాష్ట్ర స‌ర్కార్ ఒప్పందం చేసుకోవ‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడారు. మనం చేస్తున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణధ్యాయంగా నిలిచి పోతుంద‌న్నారు.

ప్రతి అడుగులోనూ రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదమ‌ని కానీ ఇప్పుడు నాణ్య‌మైన విద్యా హ‌క్కు అన్న‌ది ముఖ్య‌మ‌న్నారు. మన పిల్లలు పోటీ పడేది చుట్టు పక్కల రాష్ట్రాలు, ఈ దేశంలో ఉన్నవారితో కాదు. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామ‌న్నారు.

ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నామ‌ని అన్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మానవ వనరుల మీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోందన్నారు.

మొట్ట మొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశామ‌న్నారు. గ్లోబల్‌ సిటిజెన్స్‌ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలన్నారు. ప్రపంచ స్ధాయితో పోటీపడాలని అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదన్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.