దేశం కోసం త్యాగానికి సిద్ధం
స్పష్టం చేసిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఈ దేశం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని శక్తులు కేవలం కొందరి కోసం మాత్రమే పని చేస్తున్నాయి. వారు మాత్రమే పాలన సాగించాలని అనుకుంటున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో మనుషుల మధ్య విభేదాలను సృష్టించి పబ్బం గడుపు కోవాలనే కుట్రలు పన్నుతూ వచ్చాయి.
దీని వల్ల ఈ దేశం అనేక రకాలుగా వెనక్కి వెళ్లి పోయింది. ఇక కాపాడు కోవాల్సిన బాధ్యత 143 కోట్ల మంది భారతీయులపైన ఉందన్నారు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. జూన్ 2న తిరిగి తీహార్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేవలం ఆప్ ను సర్వ నాశనం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు.
కానీ వారి ఆటలు సాగలేదు. వారి కుట్రలు ఫలించ లేదన్నారు. తాను బతికి ఉన్నంత వరకు ఆప్ ను కదిలించ లేరంటూ హెచ్చరించారు. ఆనాడు దేశం కోసం తన విలువైన ప్రాణాన్ని భగత్ సింగ్ అర్పించాడని , ఇవాళ తాను కూడా తన ప్రాణాన్ని ఈ దేశ భవిష్యత్తు కోసం త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.