ఇండియా కూటమి గెలుపు ఖాయం
సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశలు గల్లంతు కావడం ఖాయమని జోష్యం చెప్పారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా దాటని ఎద్దేవా చేశారు. ఏం చేశారని ఈ దేశం కోసం మోడీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. దేశాన్ని అన్ని రకాలుగా సర్వ నాశనం చేసిన ఘనత ప్రధానమంత్రికే దక్కుతుందన్నారు.
ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికి కనీసం 300 సీట్లకు పైగా వస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం కొద్ది మంది పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు, బిలియనీర్లకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారంటూ మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రధానమంత్రి తనంతకు తానుగా దేవుడినని , దైవాంశ సంభూతుడినని భావిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి , దాని పరివారానికి బిగ్ షాక్ ఈసారి ఎన్నికలు ఇస్తాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అబద్దాలు చెప్పడంలో ప్రధానమంత్రి ఆరి తేరాడని ధ్వజమెత్తారు కేజ్రీవాల్.