పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్ కతా – తన జీవితమంతా పోరాడటంతోనే సరి పోయిందన్నారు సీఎం మమతా బెనర్జీ. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవాలను తెలియ చేయాలనే ఉద్దేశంతోనే పుస్తకాలు రాశానని అన్నారు. బుక్ ఎగ్జిబిషన్ లో తాను రాసిన మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. తనను పుస్తకాలు ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. ఆడంబరాలు, భేషజాలకు పోనని, అత్యంత సాధారణంగా ఉండేందుకు ఇష్ట పడతానని అన్నారు. తనకు నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే పుస్తకాలేనని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.
కోల్ కతా లో ఏర్పాటు చేసిన 48వ కోల్ కతా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను రాసిన పుస్తకాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు సీఎం. పుస్తకాలు లేని గదిని తాను ఊహించ లేనని అన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, నిరాశకు గురైనప్పుడు పుస్తకాలే తనకు అండగా ఉన్నాయని చెప్పారు మమతా బెనర్జీ.
ఇదిలా ఉండగా తను ఇప్పటి వరకు 153 పుస్తకాలు రాశారు. సాహిత్య, రాజకీయ రంగాలకు సంబంధించినవే కావడం విశేషం. గత ఏడాది 2024లో ఏడు పుస్తకాలను ఆవిష్కరించారు. కొత్తగా విడుదల చేసిన పుస్తకాలకు లిపిబొడ్డో కిచు కాజ్, బంగ్లార్ నిర్బచోన్ ఓ అమ్రా, సెల్యూట్ 2 అనే పేర్లు ఉన్నాయి. 50 మంది ప్రముఖులకు నివాళులు అర్పించారు మమతా బెనర్జీ.
వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కాలాల్లో పుడతారు. కానీ ఎవరైనా నన్ను అడిగితే, నేను పోరాట కాలంలో పుట్టానని చెబుతాను ఎందుకంటే నా జీవితమంతా పోరాటంలోనే గడిపాను. చిన్నతనంలో, నేను పేదరికంతో పోరాడాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పోరాటం నా మతంగా మారిందన్నారు. నేను ప్రజల కోసం, బెంగాల్ కోసం పోరాటం చేపట్టాల్సి వచ్చిందన్నారు. టీఎంసీ గెలుపు చరిత్ర గురించి ఇందులో వివరించారు.
కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా తాను చేసిన పనుల గురించి వివరించారు మరో పుస్తకంలో సీఎం. మమతా బెనర్జీ కోట్లాది మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పక తప్పదు. మహిళా సాధికారతకు దర్పణంగా నిలుస్తున్నారు.