రేప్ కేసులపై పీఎంకు దీదీ లేఖ
రోజుకు దేశ వ్యాప్తంగా 90కి పైగా కేసులు
పశ్చిమ బెంగాల్ – ఓ వైపు పశ్చి మ బెంగాల్ లో ప్రభుత్వ అలసత్వం కారణంగానే ట్రైనీ డాక్టర్ రేప్ , మర్డర్ కు గురైందని భారీ ఎత్తున విమర్శలు, ఆరోపణలు , ఆందోళనలు, నిరసనలు పెరుగుతుండగా మరో వైపు సీఎం ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం విస్తు పోయేలా చేసింది.
తమను టార్గెట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ పెద్ద ఎత్తున రేప్ కేసులు నమోదవుతున్నాయని, దీనిపై కేంద్ర హోం శాఖ , కేంద్రం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. అసలు పాలన పడకేసిందని, ప్రధానమంత్రి నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు మమతా బెనర్జీ.
తమ సర్కార్ ను బద్నాం చేసేందుకే భారతీయ జనతా పార్టీ, కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఇదిలా ఉండగా ప్రతి రోజూ 90కి పైగా అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయని, వీటిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా బెనర్జీ.
ఇందుకు సంబంధించి నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, వెంటనే కఠినమైన చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు సీఎం.