దోషులు ఎవరైనా సరే చర్యలు తప్పవు
స్పష్టం చేసిన సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ – ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కోల్ కతాలో చోటు చేసుకున్న డాక్టర్ అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. జూనియర్, సీనియర్ డాక్టర్లు ఓపీ సేవలను నిలిపి వేశారు. ఆందోళన బాట పట్టారు. ఈ సందర్బంగా సీఎం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు కోల్ కతాలో.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ అత్యాచార ఘటన తనను తీవ్రంగా బాధకు గురి చేసిందన్నారు. అలా అని ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. మీరంతా ఆందోళన చేపట్టడం సమంజమేనని, ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
తాము ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని, విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు మమతా బెనర్జీ. ఎవరూ ఆందోళనకు గురి కావద్దని, ఇక నుంచి ప్రతి ఆస్పత్రి, కాలేజీ వద్ద భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు సీఎం.
అయితే కొందరు కావాలని ఈ ఘటనను ఆసరాగా తీసుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి చిల్లర పాలిటిక్స్ చేయకుండా సర్కార్ కు సహకరించాలని కోరారు మమతా బెనర్జీ.
విచారణ చేపడతాం, దోషులను వదిలి పెట్టం, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.