తుఫాను వల్ల వెల్లడం లేదు
స్పష్టం చేసిన సీఎం దీదీ
పశ్చిమ బెంగాల్ – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కావాలని భారత కూటమి సమావేశానికి వెళ్లడం లేదంటూ వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
జూన్ 1న భారత బృందం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. దీనికి హాజరు కావాలంటూ తనకు ప్రత్యేకంగా ఆహ్వానం కూడా అందిందని చెప్పారు. కాగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో 10 లోక్ సభ స్థానాలకు ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నాయని దీంతో తాను ఇక్కడ ఉండడం తప్పనిసరిగా మారిందన్నారు సీఎం దీదీ.
అంతే కాకుండా పంజాబ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో జూన్ 1న పోలింగ్ కొనసాగుతుందన్నారు. మరో వైపు రాష్ట్రంలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు మమతా బెనర్జీ. అంతే కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశానని తెలిపారు .