చెస్ మాస్టర్ గుకేష్ కు నజరానా
రూ. 75 లక్షల ఆర్థిక సాయం
తమిళనాడు – రాష్ట్రానికి చెందిన గుకేష్ ధన్ రాజ్ సెన్సేషన్ గా మారాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో వరల్డ్ ఛాంపియన్ గా అవతరించాడు. గుకేష్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే తనకు చదరంగం అంటే చచ్చేంత ఇష్టం. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
రూ. 75 లక్షల రూపాయల ప్రోత్సాహం అతడికి లభించింది. అంతే కాకుండా షీల్డ్ తో తిరిగి వచ్చాడు. తన కుటుంబంతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశాడు. ఆయన వెంట సీఎం తనయుడు, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నాడు.
భారీ ఎత్తున నజరానా ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్. గుకేష్ కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. తాము విద్యతో పాటు, అన్ని క్రీడలను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు సీఎం. తమిళనాడు నుంచి వివిధ క్రీడా విభాగాలలో రాణించేలా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు.
యువతను ప్రోత్సహించేందుకు కేంద్రం ముందుకు రావాలని సూచించారు ఎంకే స్టాలిన్.