రాహుల్ గాంధీకి రక్షణ కల్పించాలి – సీఎం
బెదిరింపులకు పాల్పడడంపై తీవ్ర ఆగ్రహం
తమిళనాడు – రాష్ట్ర ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయనను చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ నాలుక నరికితే రూ.11 లక్షల రివార్డు ఇస్తామని మహారాష్ట్ర కు చెందిన శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ప్రకటించడం పట్ల మండిపడ్డారు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఇలాగేనా కామెంట్ చేసేది అంటూ ఫైర్ అయ్యారు సీఎం ఎంకే స్టాలిన్.
ఇదే సమయంలో సంజయ్ గైక్వాడ్ ప్రసంగం పెను దుమారం రేపింది. అమెరికాలో రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ ప్రసంగం చేసినందుకు ఆయన నాలుక కోయాలని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అన్నారు.
దీంతో వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా మహారాష్ట్ర పోలీసులు సంజయ్ గైక్వాడ్‌పై కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై పలువురు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విధంగా రాహుల్ గాంధీకి బెదిరింపులను ఖండిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ పేజీలో ఓ పోస్ట్ పెట్టారు.
ఈ పోస్ట్‌లో బీజేపీ నాయకుడి బెదిరింపు గురించి మీడియాలో వచ్చిన కథనాలు షాక్‌కు గురిచేశాయి. నా సోదరుడు రాహుల్‌కు పెరుగుతున్న మద్దతు కొంత మందిని కలవర పెట్టింది. రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలి. కేంద్ర ప్రజాస్వామ్యంలో హింస , బెదిరింపులకు చోటు లేదని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఎంకే స్టాలిన్.