సీజేఐ తీర్పు స్పూర్తి దాయకం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం ఆయన స్పందించారు. రాష్ట్రంలో గవర్నర్ గా కొలువు తీరిన ఆర్ఎన్ రవి వ్యవహారం అహంకార పూరితంగా వ్యవహరిస్తూ వచ్చారని తెలిపారు. రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన వ్యక్తి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రయారిటీ ఇవ్వడం మంచి పద్దతి కాదని పదే పదే చెబుతూ వచ్చామని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్.
అయినా తన నిరంకశ భావ జాలాన్ని వీడేందుకు ఇష్ట పడలేదన్నారు. భారత దేశంలో ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులు ఉంటాయని తెలుసుకోక పోవడం దారుణని పేర్కొన్నారు. ఇదే సమయంలో తమ పార్టీకి చెందిన పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరాకరించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీజేఐ.