సంక్షేమం డీఎంకే నినాదం
సీఎం ఎంకే స్టాలిన్ ధీమా
తమిళనాడు – సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకేతో కూడిన భారత కూటమి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం ఎంకే స్టాలిన్. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. చెన్నైలోని స్థానికులతో ముచ్చటించారు. వారిని పరామర్శించారు.
ఈ సందర్బంగా వారు తమ సమస్యలను విన్నవించారు. అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నారా అంటూ అడిగారు సీఎం ఎంకే స్టాలిన్.
అనంతరం మీడియాతో మాట్లాడారు స్టాలిన్. ఇండియా కూటమికి ఎదురే లేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు సీఎం. ఈ దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును డీఎంకేకు వేయాలని కోరారు. లేకపోతే రాచరిక వ్యవస్థకు వంత పాడే బీజేపీని గద్దెనెక్కించిన వారవుతారంటూ హెచ్చరించారు ఎంకే స్టాలిన్.