స్పెయిన్ లో స్టాలిన్ బిజీ
అధికారిక పర్యటనలో జోష్
స్పెయిన్ – డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం స్పెయిన్ లో కొలువు తీరారు. అక్కడి ప్రాంతాలను పరిశీలించారు. అత్యంత సాధారణమైన జీవితం గడిపేందుకు ఇష్టపడతారు స్టాలిన్.
రాష్ట్రంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పుంజుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇదే సమయంలో రాష్ట్ర అభివృద్ది కోసం పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు విదేశీ పర్యటనలు చేయడం పరిపాటిగా వస్తోంది. ప్రత్యేకించి అరబ్ దేశాలతో పాటు తమిళులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వివిధ రంగాలలో పని చేస్తున్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న దిగ్గజ కంపెనీలలో కీలక పోస్టులలో వీరే ఉన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అద్భుతమైన నగరంగా వినుతికెక్కిన స్పెయిన్ లో స్టాలిన్ హల్ చల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సీఎం స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.