ఎన్డీయేకు 295 సీట్లు పక్కా
సీఎం మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ – దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ . ఎన్డీయే కూటమికి 295 సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. మంగళవారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఇంకా కొన్ని రౌండ్లు లెక్కించాల్సి ఉందని, అప్పటి దాకా వేచి ఉండడమే మిగిలి ఉందన్నారు.
తమ పార్టీ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా , నినాదంగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లామన్నారు. ముచ్చటగా మూడోసారి తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు సీఎం.
దేశ చరిత్రలో నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ పీఎంగా చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు మోహన్ యాదవ్. ఎన్నికల సంఘం వివరాలు ప్రకటించిన తర్వాత తాము మాట్లాడతామని అంత వరకు కామెంట్స్ చేయాలని అనుకోవడం లేదన్నారు .
ప్రజలు మరోసారి మోడీని పీఎం కావాలని కోరుకున్నారని ఇది సత్యమన్నారు. దేశం ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతుందని భావించారని చెప్పారు సీఎం.