Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHధాన్యం సేక‌ర‌ణ‌లో త‌ప్పులు జ‌ర‌గొద్దు

ధాన్యం సేక‌ర‌ణ‌లో త‌ప్పులు జ‌ర‌గొద్దు

హెచ్చ‌రించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని హెచ్చ‌రించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తేమ శాతంలో కచ్చితత్వం ఉండాలని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. పంట‌కు డిమాండ్ రావాలంటే వినియోగం పెర‌గాల‌ని సూచించారు సీఎం.

శుక్ర‌వారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు నారా చంద్ర‌బాబు నాయుడు. రైతుల నుంచి ధాన్య సేకరణ ఎలా చేస్తున్నారో సీఎంకు రైతు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు.

అనంతరం తాము ధాన్యం ఎలా అమ్ముతున్నదనే దానిపై సీఎంకు రైతులు వివరించారు. రైతులు ఏ పంటలు వేయాలి? ఏవి లాభసాటిగా ఉంటాయి? అనే అంశాలను అధికారులు రైతులకు వివరించాలని సీఎం సూచించారు.

రైతులు పండించే పంటకు డిమాండ్ రావాలంటే వినియోగం పెరగాల్సి అవసరం ఉందన్నారు. ఏ రకం బియ్యం ఎక్కువగా తింటున్నారో, అవే రైతులు పండించేలా అధికారులు ప్రోత్సహించాలని స్ప‌ష్టం చేశారు చంద్రబాబు నాయుడు.

రైతుల సాగు ఖర్చు తగ్గించి, ఆదాయం పెంచడమే మా లక్ష్యం అన్నారు. నిర్ధారించిన దానికంటే ఎక్కువ తేమ శాతం ఉంటే, డ్రైయర్స్ ఉపయోగించాల్సి వస్తుంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments