జనాదరణలో సీఎం నవీన్ నెంబర్ వన్
రెండో స్థానంలో యూపీ సీఎం యోగి
న్యూఢిల్లీ – ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలనంగా మారారు. దేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో టాప్ లో నిలిచారు. ఓ ఆంగ్ల పత్రిక తాజాగా సర్వే చేపట్టింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల పని తీరు ఎలా ఉందనే దానిపై .
ఈ సందర్బంగా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఆయనకు రాష్ట్రంలో విపరీతమైన జనాదరణ ఉందని తేలింది. వరుసగా సీఎంగా గెలుస్తూ వచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా కూల్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.
కరోనా కష్ట కాలంలో తను ఆదుకున్నారు. అంతే కాదు వరదల్లో సైతం ఆయా రాష్ట్రాలకు తోడుగా నిలిచారు. మొత్తంగా తనదైన శైలిలో పాలన సాగిస్తూ ముందుకు సాగుతున్నారు నవీన్ పట్నాయక్. ఇక ర్యాంకుల పరంగా చూస్తే ఒడిశా సీఎం టాప్ లో ఉంటే రెండవ స్థానంలో నిలిచారు యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ , మూడో స్థానంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారు.