NEWSNATIONAL

మోదీతో నితీష్ క‌ర‌చాల‌నం

Share it with your family & friends

ఎలా ఉన్నారంటూ ప‌ల‌క‌రింపు

న్యూఢిల్లీ – భార‌త దేశంలో రాజ‌కీయాలు మ‌రీ విచిత్రంగా ఉంటాయి. నిన్న‌టి దాకా ఇండియా కూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉన్న‌ట్టుండి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. దీనికి కార‌ణం ఉన్న‌ట్టుండి బీజేపీతో క‌టీఫ్ చెప్పారు. ఆ వెంట‌నే కాంగ్రెస్ తో జ‌త క‌ట్టారు. ఆ త‌ర్వాత కూట‌మి అంటూ హ‌ల్ చ‌ల్ చేశారు.

మ‌మ‌తా బెన‌ర్జీ, అర‌వింద్ కేజ్రీవాల్ , బిజూ ప‌ట్నాయ‌క్ , ఎంకే స్టాలిన్, ఉద్ద‌వ్ ఠాక్రే , త‌దిత‌రులంద‌రితో చ‌ర్చ‌లు జ‌రిపారు. చివ‌ర‌కు ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ ఇచ్చారు. తాను కూట‌మి నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ఖర్గే తో పాటు రాహుల్ , సోనియా, ప్రియాంక‌కు షాక్ త‌గిలింది.

ఇదంతా ప‌క్క‌న పెడితే తాజాగా బీహార్ లో మ‌రోసారి సీఎంగా కొలువు తీరారు. వ‌రుస‌గా దేశ చ‌రిత్ర‌లో ఆరు సార్లు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం విశేషం. కేవలం అధికారం కోసం పొత్తులు కుదుర్చు కోవ‌డం ఆ త‌ర్వాత వారితో కంటిన్యూగా మిత్ర‌త్వాన్ని పాటించ‌క పోవ‌డం విడ్డూరం క‌దూ. ఢిల్లీలో తాజాగా నితీష్ కుమార్ పీఎం మోదీతో భేటీ అయ్యారు.