NEWSNATIONAL

ప్ర‌ధాని మోదీ ప‌నిమంతుడు

Share it with your family & friends

కితాబు ఇచ్చిన సీఎం నితీశ్ కుమార్

బీహార్ – బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై. గ‌తంలో విడి పోయిన ఆయ‌న చివ‌ర‌కు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ మ‌ళ్లీ కాషాయ పార్టీతో జ‌త క‌ట్టారు. అంత‌కు ముందు ఇండియా కూట‌మి ఏర్పాటు అయ్యేందుకు కృషి చేశారు. ఆ వెంట‌నే మ‌న‌సు మార్చుకున్నారు. స్థిమ‌తంగా ఉండ‌ని సీఎం ప్ర‌స్తుతం క‌లిసి ముందుకు సాగుతుండ‌డం విశేషం.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని గురించి ప్ర‌త్యేకంగా ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు సీఎం నితీశ్ కుమార్. ఆయ‌న గొప్ప ప‌నిమంతుడంటూ పేర్కొన్నారు. త‌న జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన అరుదైన ప్ర‌జా నాయ‌కుడు క‌ర్పూరీ ఠాకూర్ అని , ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని తాము కోరామ‌ని చెప్పారు.

తాము విన్న‌వించిన వెంట‌నే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చొర‌వ తీసుకున్నార‌ని, ఠాకూరీకు భార‌త‌ర‌త్న రావ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని, ఈ సంద‌ర్బంగా పీఎంకు తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు నితీశ్ కుమార్.