మోడీ నాయకత్వం దేశానికి అవసరం
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కామెంట్
న్యూఢిల్లీ – జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎన్డీయే, బీజేపీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నాయకుడిగా నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సమావేశానికి కీలకంగా మారారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో పాటు సీఎం నితీశ్ కుమార్ ఇరు వైపులా కూర్చున్నారు. ఎన్డీయే కానున్నారని టాక్. ఇది పక్కన పెడితే ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో బాబు, నితీశ్ కీలకంగా మారనున్నారు.
ఇదిలా ఉండగా తీర్మానం చేసిన అనంతరం సీఎం నితీశ్ కుమార్ ప్రసంగించారు. సమర్థవంతుడైన నాయకుడిగా మోడీ గుర్తింపు పొందారని అన్నారు. అందుకే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు చెప్పారు సీఎం.
ఆదివారం కంటే ఇవాళే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.