కలాం జీవితం స్పూర్తిదాయకం
దేశం గర్వించ దగిన శాస్త్రవేత్త
హైదరాబాద్ – ఏపీజే కలాం మహోన్నత మానవుడని ఆయన చేసిన సేవలు దేశానికి స్పూర్తి దాయకంగా నిలిచాయని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి . మాజీ రాష్ట్రపతి వర్థంతి జూలై 27 సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన కలాం తనకు స్పూర్తి అని పేర్కొన్నారు. తన లాంటి వారిని ఎందరినో ప్రభావితం చేశారని కొనియాడారు. అత్యున్నతమైన పదవిని అలంకరించడమే కాకుండా ఆ పదవికి వన్నె తీసుకు వచ్చిన మహానుభావుడు అంటూ ప్రశంసించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
శాస్త్ర వేత్తగా ఆయన చేసిన ప్రయోగాలు, జాతికి అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని , ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచి పోకూడదని ఆయన మనకు నేర్పారని, చివరి దాకా సాధారణ జీవితం గడిపారంటూ పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.
విద్యార్థులు, యువతీ యువకులు , జీవితంలో ఎదగాలని అనుకునే వారంతా ఏపీజే కలాంను చూసి నేర్చుకోవాలని , ఆయన భౌతికంగా లేక పోయినా అందరి హృదయాలలో, 143 కోట్ల మంది భారతీయులలో ఉన్నారని అన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.