వరద బీభత్సం రూ. 5 వేల కోట్ల నష్టం
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అనుముల
సూర్యాపేట జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం రోడ్డు మార్గం ద్వారా పరామర్శించారు. ఈ సందర్బంగా సూర్యాపేట జిల్లాలో పర్యటించారు సీఎం.
ఇక్కడ సమీక్ష చేపట్టారు ఎ. రేవంత్ రెడ్డి. ఎవరూ ఆందోళన చెంద వద్దని కోరారు. ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రాణ, ఆస్తి నష్టం పై వివరాలు తెలుసుకుని తక్షణ సహాయం కోసం జిల్లాకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు సీఎం.
ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని, పశువులు (జీవాలు) చని పోతే రూ. 50 వేలు , పంట నష్టం జరిగితే రూ. 10 వేలు పరిహారం ఇవ్వాలని ఇప్పటికే సీఎస్ ను ఆదేశించడం జరిగిందని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని పేర్కొన్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని , ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలలో నిమగ్నమై ఉందన్నారు సీఎం.