స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన మాట మేరకు జాబ్స్ భర్తీ చేయడం జరుగుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా నూతనంగా ఎంపికైన 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్ , మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందజేశారు సీఎం.
సోమవారం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
కానీ తాము వచ్చాక ఒక్కో శాఖను ప్రక్షాళన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు పలు నోటిఫికేషన్లను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా మిగిలి పోయిన ఖాళీలను వెంటనే భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
గ్రూప్ -1 పోస్టులను పెంచుతూ ఇప్పటికే ప్రకటించిన దానిని రద్దు చేయడం జరిగిందన్నారు. తాజాగా కొత్తగా అదనపు పోస్టులను కలిపామని, మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఎవరూ నిరాశ చెంద వద్దని సూచించారు రేవంత్ రెడ్డి.