హరీశ్ నీదో స్థాయి..నీదో బతుకు – సీఎం
రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తనతో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరికి ఎంత దమ్ముందో జనానికి తెలుసన్నారు.
హరీశ్ రావు నువ్వు చెప్పులు మోశేటోడివి..నన్ను విమర్శించేంత, నాకు సవాల్ విసిరేంత దమ్ము, ధైర్యం నీకు లేదన్నారు రేవంత్ రెడ్డి. నీదో స్థాయి..నీదో బతుకు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం. నా ఇంటి ముందు చేతులు కట్టుకుని నిలబడిన విషయం మరిచి పోయినవా అంటూ ఎద్దేవా చేశారు . చేతులు కట్టుకుని నిలబడిన రోజులు మరిచి పోయి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ దయ తలిస్తే ఇవాళ ఈ స్థాయికి ఎదిగినవ్ అన్నారు. హవాయ్ చెప్పులు ఉన్న నిన్ను మంత్రిని చేసిన ఘనత తమ పార్టీదేనని ఇంకోసారి సవాళ్లు, ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎ. రేవంత్ రెడ్డి.
నిరాధారమైన ఆరోపణలు, అసత్యాలు, విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హరీశ్ రావుకు హితవు చెప్పారు ముఖ్యమంత్రి. ఇదిలా ఉండగా దమ్ముంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి. ఈ నేపథ్యంలో పై విధంగా స్పందించారు రేవంత్ రెడ్డి.