గవర్నర్ కు సీఎం ఆహ్వానం
రాష్ట్ర వేడుకులకు పిలుపు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు ప్రముఖులు, కవులు, రచయితలు, గాయనీ గాయకులకు ఆహ్వానం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్బంగా ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్ ను ఆహ్వానించారు.
అంతకు ముందు సీఎం, డిప్యూటీ సీఎంలు గవర్నర్ రాధాకృష్ణన్ ను శాలువాతో సన్మానించారు. పూల బోకే అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గవర్నర్ శాలువాతో సత్కరించి బోకే ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆయన పుణ్య భూమిగా అభివర్ణించారు.