టీ ఫైబర్ రూ. 1779 కోట్లు ఇవ్వండి – సీఎం
కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం భేటీ
ఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో బిజీగా ఉన్నారు. శుక్రవారం కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు.
టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను త్వరగా ఆమోదించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు సీఎం, డిప్యూటీ సీఎం. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వర్క్ కల్పించడమని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
టీ-ఫైబర్ ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి, భట్టి.
గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించేందుకు వీలు కుదురుతుందని తెలిపారు.
టీ-ఫైబర్ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కోరారు సీఎం. ఇదే సమయంలో భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింప జేయాలని విన్నవించారు.
టీ-ఫైబర్ కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.