రాష్ట్రపతికి సీఎం గ్రాండ్ వెల్ కమ్
శీతాకాల విడిదికి హైదరాబాద్ కు
హైదరాబాద్ – శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సందర్బంగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా అంతకు ముందు ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టాలు పొందిన విద్యార్థులను అభినందించారు.
విద్య, వైద్యం అనేవి అత్యంత ముఖ్యమని వాటి పట్ల ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. దేనిని కోల్పోయిన తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కానీ కోల్పోయిన కాలాన్ని తీసుకు రాలేమని గుర్తించాలని, అందుకే ఉన్నతమైన ఆశయం, లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయత్నం చేయాలని సూచించారు ద్రౌపది ముర్ము.