ఝాన్సీ రెడ్డిని పరామర్శించిన సీఎం
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఝాన్సీ రెడ్డిని పరామర్శించారు. ఆమె ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి హుటా హుటిన ఆమె వద్దకు వెళ్లారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన శ్రీకాళహస్తి శాసన సభ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు. ఆయన కూడా ఝాన్సీ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు.
అనంతరం శ్రీకాళహస్తిలో తెలంగాణ భవన్ ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించారు ఎమ్మెల్యే.
శ్రీకాళహస్తి దేవస్థానంను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కంకణబద్దులై ఉన్నామని తెలిపారు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలో అతిధి గృహాలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని వెల్లడించారు సీఎంకు. దేవస్థానం పరిసర ప్రాంతంలో అర్ద ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకాళహస్తిలో తెలంగాణ అతిధి గృహం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.