NEWSTELANGANA

కొడంగ‌ల్ లో మెడిక‌ల్..న‌ర్సింగ్ కాలేజీ

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని తెలంగాణ‌కు త‌ల‌మానికంగా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఆ మేర‌కు కోడంగ‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ (కుడా)ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు కూడా జారీ చేశారు.

సోమ‌వారం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ స‌చివాల‌యంలో వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మావేశంలో మంత్రి దామ‌ర రాజ న‌ర‌సింహ‌, సీఎస్ శాంతి కుమారి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో మెడిక‌ల్ కాలేజీ ఉన్న ప్ర‌తి చోట న‌ర్సింగ్, పారా మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. కోడంగ‌ల్ లో మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీలు వెంట‌నే ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీనిపై సాధ్యా సాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే కాకుండా బీబీ న‌గ‌ర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయిలో వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చేలా చూడాల‌ని ఆదేశించారు. వెంట‌నే పూర్తి నివేదిక త‌న‌కు అంద‌జేయాల‌ని అన్నారు రేవంత్ రెడ్డి.