NEWSTELANGANA

పెండింగ్ ప్రాజెక్టుల‌న్నీ పూ్ర్తి చేస్తాం – సీఎం

Share it with your family & friends

యుద్ధ ప్రాతిప‌దిక‌న నిధులు కేటాయిస్తాం

ఖ‌మ్మం జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్నింటిని యుద్ద ప్రాతిప‌దిక‌న పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఇందులో ఎలాంటి అనుమానాల‌కు తావు లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు కంక‌ణం క‌ట్టుకుంద‌న్నారు. వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పారు. రైతులే దేశానికి శ్రీ‌రామ ర‌క్ష అన్నారు రేవంత్ రెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసు గూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ స్విచ్ ఆన్ చేశారు సీఎం. ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. సహచర మంత్రివర్యులతో కలిసి సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు.

ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతలకు నిధులు కేటాయించడంతో ఇతర జిల్లాల్లోని ప్రజా ప్రతినిధుల నుంచి కూడా ఒత్తిడి పెరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.