సీఎం శుభవార్త పోస్టుల భర్తీకి పచ్చ జెండా
యూనివర్శీటీల వీసీలు..ఇతర పోస్టుల భర్తీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంబంధించి త్వరలోనే మరికొన్ని పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఇప్పటి దాకా ఆయా యూనివర్శిటీలకు సంబంధించి వైస్ ఛాన్స్ లర్ పోస్టులతో పాటు ఖాళీగా అన్ని బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
మధ్య దళారీల మాటలు నమ్మ వద్దని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను దశల వారీగా భర్తీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాబోయే 15 రోజులలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమం కింద ముఖ్యమంత్రి 135 మంది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫైయర్‌లకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష పంపిణీ చేశారు, అంతే కాకుండా మెయిన్స్ అర్హత సాధించిన వారికి కూడా రూ. ఒక లక్ష సాయంగా అందజేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.
యువతకు అసాధారణమైన శిక్షణ , విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 20-25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కూడా ఏర్పాటు చేస్తోందని అన్నారు.