NEWSTELANGANA

రైతు..విద్యా క‌మిష‌న్ల ఏర్పాటు

Share it with your family & friends

త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌న్న సీఎం రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే రైతు క‌మిష‌న్ తో పాటు విద్యా క‌మిష‌న్ ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. విధి విధానాలు , మార్గ‌ద‌ర్శ‌కాల‌ను త‌యారు చేయాల‌ని ఇప్ప‌టికే సీఎస్ ను ఆదేశించిన‌ట్లు సీఎం తెలిపారు. దీంతో గ్రేట‌ర్ సిటీ కార్పోరేష‌న్ ను కూడా ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌న విద్యా విధానం ఎలా ఉండాలో విద్యా క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు రేవంత్ రెడ్డి. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేస్తామ‌న్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.

పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశామ‌న్నారు సీఎం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామ‌ని చెప్పారు.

కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామ‌న్నారు. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్న‌ట్లు తెలిపారు.

రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామ‌ని అన్నారు.