NEWSTELANGANA

Share it with your family & friends

క్రీడ‌ల హ‌బ్ గా తెలంగాణను చేస్తాం – సీఎం
ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం గ‌చ్చిబౌలిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రాన్ని క్రీడ‌ల‌కు హ‌బ్ గా త‌యారు చేస్తామ‌ని చెప్పారు.

క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేక పోయిందని ఆరోపించారు. దీని వ‌ల్ల ఎంతో మంది ప్ర‌తిభ క‌లిగిన వారు నిరాద‌ర‌ణ‌కు గురైన‌ట్లు వాపోయారు సీఎం.

క్రీడలను ప్రోత్సహించేందుకు త‌మ‌ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంద‌ని చెప్పారు. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామ‌ని తెలిపారు సీఎం. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి.

గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

అంతర్జాతీయ స్ధాయి కోచ్ లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలియ చేశామ‌న్నారు రేవంత్ రెడ్డి.