ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో దొరల రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చింది. మొత్తం రెడ్ల సామాజిక వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారంటూ బహుజన సమాజం నిప్పులు చెరుగుతోంది. అయినా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎంగా కొలువు తీరాడో ఆనాడే తెలిసి పోయింది వారి సామాజిక వ్యక్తులకే ప్రయారిటీ ఉంటుందని.
గతంలో వెలమ, దొరలకు చెందిన పాలన కొనసాగింది. పదేళ్ల పాటు వాళ్లు రాచరిక పాలన సాగించారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు నేలకేసి కొట్టారు. ఓటు అనే ఆయుధంతో రెడ్డికి పవర్ అప్పగించారు. తీరా పవర్ మారిందే తప్పా ఏమీ మారలేదని డీఎస్పీ చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే రెడ్లకు సీట్లు కేటాయించిన రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త మన్నె జీవన్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే కుటుంబానికి చెందిన మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన వల్ల జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు.