సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం రాష్ట్ర శాసన సభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపారు. చేసిన అడ్డగోలు దందాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో గొర్రెల పథకంలో ఏకంగా రూ. 700 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.
కాగా మెట్రో విస్తరణపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆరు నూరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రోను నిర్మిస్తామని ప్రకటించారు. ఎల్ అండ్ టీ కంపెనీకి వార్నింగ్ కూడా ఇచ్చామని చెప్పారు సీఎం. తేడా వస్తే చంచల్ గూడ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పామన్నారు .
అది ఓల్డ్ సిటీ కాదని ఒరిజనల్ సిటీ అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా రెండో విడత మెట్రో విస్తరణపై గత సర్కార్ కాకి లెక్కలు చెపిందని ఆరోపించారు. హైదరాబాద్ కు మెట్రో తెచ్చిందే తమ పార్టీ అని గుర్తు చేశారు.