న్యూయార్క్ తో పోటీ పడేలా మరో నగరం
నిర్మిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రధానంగా న్యూయార్క్ నగరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా రాజధాని న్యూయార్క్ నగరానికి ధీటుగా ఉండేలా అద్భుతమైన మరో నగరాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్మిస్తామని, ఇందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. సైబరాబాద్ ఇప్పుడు రాజధానికి తల మానికంగా ఉందన్నారు. ఇలాంటి నగరం తరహాలో హైదరాబాద్ లో కొత్త నగరం నిర్మించాలన్నది తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్లాన్స్ తయారు చేస్తున్నట్లు చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇందు కోసం నగరానికి దగ్గరలో ఉన్న మహేశ్వరం ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇది అన్ని హంగులతో కూడుకుని ఉంటుందన్నారు. అంతే కాకుండా రాచకొండ ప్రాంతంలో మరో ఫిల్మ్ సిటీని అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు ఎనుముల రేవంత్ రెడ్డి. మన వారే కాదు కోలీవుడ్, బాలీవుడ్ నటీ నటులు ఇక్కడికి వచ్చి షూటింగ్ లు చేసేలా తయారు చేస్తామన్నారు.